Oct 26,2023 22:01

ప్రజాశక్తి - సీతానగరం ప్రయివేటు కార్యక్రమాలకు సైతం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తరలించడం అధికార వైసిపికి పరిపాటిగా మారిందని టిడిపి రాజానగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి విమర్శంచారు. పురుషోత్తపట్నం గ్రామంలో మండ రాంబాబు ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం ఇన్‌ఛార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు. బాబుతో నేను అంటూ 9261292612 నెంబర్‌కు మిస్సెడ్‌ కాల్‌ చేసి చంద్రబాబుకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. అనారోగ్యానికి గురైన పలువురు సీనియర్‌ కార్యకర్తలను పరమార్శించారు. గ్రామ ప్రజలతో ప్రజావేదిక ఏర్పాటు చేసి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను వివరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది అన్నట్లు రాష్ట్రంలో సిఎం పర్యటన జరిగితే ఆ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడం దారుణమన్నారు. పైగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాలు అన్న తేడా లేకుండా ప్రజలను తరలించడానికి వాలంటీర్లతో సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని భయపెడు తున్నారని ఆరోపించారు. గురువారం జరిగిన ఒక ప్రయివేటు కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇచ్చి, పాఠశాలల బస్సులను ఆ కార్యక్రమానికి ప్రజలను తరలిం చారని విమర్శంచారు. ఎవరి అనుమతితో పాఠశాలలకు సెలవులు ఇచ్చి ప్రజలను భయపెట్టి ఆ కార్యక్రమానికి తరలించారో, పాఠశాలల బస్సులను ఉపయోగించుకున్నారో వారిపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలను వెళ్ళకుండా నిరోధించడం కోసమే వాలంటీర్లతో సంక్షేమ పథకాలు నిలిపేస్తామని ప్రచారం చేసి భయపెడుతున్నారని విమర్శంచారు.