
ప్రజాశక్తి - మాచర్ల : నియోజకవర్గంలో వైసిపి నాయకులు పెట్టించే తప్పుడు కేసులకు భయపడితే బానిసలుగా బతకాల్సి వస్తుందని, ధైర్యంగా ఎదుర్కొందామని టిడిపి నియోజక వర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి అన్నారు. మాచర్ల నియోజకవర్గ స్థాయి టిడిపి, జనసేన సంయుక్త సమా వేశం స్థానిక టిడిపి ఆఫీసు సమీపంలో గురువారం నిర్వహించారు. బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను అడ్డగొలుగా పెంచిందని, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలను, ఇసుక, కంకర, పెట్రోల్, డిజీల్ తదితర ధరలన్ని విపరీతంగా పెంచి అందరికీ సమానంగా భారాలు వేశారని ఎద్దేవ చేశారు. చంద్రబాబు మీదే తప్పుడు కేసులు పెట్టిన వారికి కింది స్థాయి నాయకులు పెద్ద లెక్కకాదన్నారు. తప్పుడు కేసులతో కొంత ఇబ్బంది ఎదురైనా అవి నిలబడేవి కాదన్నారు. ఈ అరాచక పాలనను చూసి జగన్‌ను ఓడించాలనే గట్టి నిర్ణ యం తీసుకున్న విజ్ఞత కలిగిన నాయకుడు పవన్‌కల్యాణ్ అన్నారు. టిడిపి, జనసేన నాయకులు కింది స్థాయి కార్యక ర్తలతో కలిసి పనిచేసి వైసిపిని ఓడిద్దామని పిలుపుని చ్చారు. ఎన్నికల నేపథ్యంలోనే వరికపూడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. 6 నెలలకు ముందు చేసే శంకుస్థాపనులు మోసం అని గత ఎన్నికలప్పుడు జగన్ చేసిన విమర్శలను గుర్తు చేశారు. తొలుత పట్టణ ంలో ప్రదర్శన చేశారు. జనసేన జిల్లా కార్యదర్శి పి.హరి, బి.రామాంజనేయులు, జి.సాంబశివరావు, టిడిపి నాయకులు రవి, కె.శివారెడ్డి, ఆన్వర్ బాషా పాల్గొన్నారు.