భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం జరగాలి
నిర్భందాన్ని చేధించి కలెక్టరేట్ ముట్టడి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
భవ్యశ్రీని హత్య చేశారు... ప్రభుత్వం, పోలీసులు నింధితుల్ని కాపాడేప్రయత్నం చేస్తోంది. సమగ్రవిచారణ జరిపి భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ సంఘాల నేతలు పోలీసుల నిర్భందాన్ని ఛేధించి కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేశారు. అడుగడుగునా పోలీసులు కనిపించిన వారినల్లా వాహనాల్లోకి ఎక్కించి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుంటే నిర్భాందాలను ఎదుర్కొని ఒక్కసారిగా కలెక్టరేట్ ముందుకు వందల సంఖ్యలో వామపక్షాలు, బీసి సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జనసేన, వడ్డెర సంఘం, బిసివై పార్టీ నాయకులను నిలువరించలేకపోయారు.
భవ్యశ్రీ కేసులో సమగ్రవిచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీసి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో శనివారం ఉదయం నుండీ కలెక్టరేట్ వద్ద పోలీసులు సందడి కనిపించింది. డిఎస్‌పి, సిఐలతో పాటు పోలీస్ సిబ్బంది పెద్దసంఖ్యలో కలెక్టరేట్‌లోకి ఎవ్వర్ని అనుమతించలేదు. సంఘాల నేతలు, సభ్యులు ఇలా పోలీసులకు తోచిన వారినళ్లా బలవంతంగా వాహనాల్లోక్కించి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సరిగ్గా 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా బెంగుళూరు రోడ్డు, చిత్తూరు రోడ్డు వైపుగా బిసి సంఘం, బిసివై నాయకులు భవ్యశ్రీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ ముందుకు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు భైటాయించి ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు వచ్చి సమాదానం చెప్పాలంటూ పట్టుబట్టారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్‌ఒ రాజశేఖర్ ఆందోళనకార్ల వద్దకు వచ్చి భవ్యశ్రీ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్ళు లేవని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తరువాత నిజానిజాలు తెలిసే అవకాశముందన్నారు. ప్రభుత్వం భవ్యశ్రీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుదని తెలిపారు. ఆందోళనలో పాల్గొనకుండా విడిగా డిఆర్‌ఒను కలసిన వడ్డెర సంఘం ఛైర్‌పర్సన్ రేవతి, డైరెక్టర్ పద్మప్రియ వడ్డెర సంఘం నాయకులు భవ్యశ్రీ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిఆర్‌ఒను కోరారు.
వడ్డెర సంఘం ఛైర్‌పర్సన్ అడ్డగింత
భవ్యశ్రీ హత్యఘటన జరిగి 15రోజులు అవుతున్నా పట్టించుకొని ఛైర్‌పర్సన్ రేవతి, బీసి సంఘాలు పిలుపునిచ్చిన తరువాత కలెక్టరేట్ రావడం పట్ల అభ్యతరం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ నుంచి బయటకు వస్తున్న వడ్డెర సంఘం ఛైర్‌పర్సన్ రేవతిని అడ్డకున్నారు. బిసి కులానికి చెందిన బాలికపై ఇంతటి దారుణం జరిగితే పట్టించుకొవడం లేదంటూ నినాదాలు చేశారు. పోలీసుల తోపులాటల మధ్య ఛైర్‌పర్సన్ పోలీసులు వాహనం ఎక్కించి అక్కడి నుండీ పంపేశారు.
కారకులను కఠినంగా శిక్షించాలి
తెలుగు మహిళా డిమాండ్
భవ్యశ్రీ అనుమానాస్ప మతికి కారకులైన వారిని సిబిఐకి అప్పగించాలని తెలుగు మహిళా నేతలు డిమాండ్ చేశారు. శనివారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రధాన కార్యదర్శి యాళ్ళ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులైన వారిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చిత్తూరు టౌన్ అధ్యక్షురాలు కటారి హేమలత, పార్లమెంట్ తెలుగు మహిళా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, చిత్తూరు టౌన్ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి పాల్గొన్నారు.










