
పీలేరు : భవ్యశ్రీ హత్యను ఖండిస్తూ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని చేస్తూ ఎపి ఎంఆర్‌పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కెవిపల్లి మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎపి ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు దొడ్డిసురేష్, దళిత సీనియర్ నాయకుడు ముల్లంగి చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రక్షణ కరువైందని అన్నారు. ఒక బిసి విద్యార్థిని అతి కిరాత కంగా అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకర విషయమ న్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు ఒక్కరు కూడా స్పందించక పోవడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఏం అన్యాయం జరిగినా బుల్లెట్ కన్నా జగనన్న ముందు ఉంటాడని మీడియా ముందు తెగ ఫోజులిస్తున్న మంత్రి రోజా ఈ సంఘటనపై ఎందుకు స్పందిం చడంలేదని ప్రశ్నించారు. ఒక బిసి విద్యార్థిని అతి దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోజా స్పందించి భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లి కార్జున, ఎర్రయ్య, కెవి పల్లి బాలుర వసతి గహం విద్యార్థులు పాల్గొన్నారు. తంబళ్లపల్లె : భవ్యశ్రీ హంతకులను కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ బాలల హక్కుల ఐక్య వేదిక కన్వీనర్ ఆవుల నరసింహులు, ఐసిడిఎస్ తంబళ్లపల్లె ప్రాజెక్టు అధికారిని సిడిపిఒ, పెద్దమండెం మండలం కలిచర్ల జడ్‌పిహెచ్‌ఎస్ ప్రధానో పాధ్యాయులు రామచంద్రలు పేర్కొన్నారు. కల్చర్ల జడ్‌పిహెచ్‌ఎసలో తంబళ్లపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసుల్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఒ నాగవేణి మాటా ్లడుతూ ఇలాంటి దుర్ఘటన జరగకుండా తల్లిదండ్రుల ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పోర్టు సంస్థ సిబ్బంది రెడ్డమ్మ, అనిత, భువనేశ్వరి, మధుబాల, అంగన్వాడీ సూపర్వైజర్లు, కళావతమ్మ, నజియాబేగం, నాగలక్ష్మి ,అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.