Sep 30,2023 23:34

భవ్య శ్రీ'కి న్యాయం చేయాలి

భవ్య శ్రీ'కి న్యాయం చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌
పెనుమూరు మండలంలో వేణుగోపాల పురంలో భవిశ్రీ హత్య జరిగి 15రోజులు అవుతున్న ఇప్పటివరకు విచారణ చేసి నిందితులను అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని వెంటనే అరెస్టు చేయాలని శనివారం చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి భువన్వేరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. భవ్యశ్రీ విద్యార్థిని హత్య వెనుక ఉన్న వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. విచారణ చేయడానికి ఇన్ని రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. హత్యపై రకరకాల కథనాలు అల్లుతున్నారని దీనిపై రోజురోజుకీ పోలీస్‌ అధికారులపై అనుమానాలు పెరుగుతున్నాయని ఈ అనుమానాలను నివత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన డిమాండ్‌ చేశారు. అతిదారుణంగా హత్య చేసిన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎవ్వరికీ ఎలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, జిల్లా అధికారులదే. జిల్లాలో ఉన్న మంత్రులు ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా హత్యపై సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.