ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని పంచాయితీరాజ్ శాఖాధికారులను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం, హౌసింగ్ కాలనీలలో ఆర్చీల నిర్మాణం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద మంజూరైన నిర్మాణ పనుల పురోగతిపై పంచాయితీ ఇంజినీర్లతో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 349 ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకుగాను 203 భవనాల నిర్మాణాలు పూర్తిచేసి సంబంధిత శాఖలకు ఇప్పటికే అందించినట్లు చెప్పారు. మిగిలిన భవన నిర్మాణాల పనులు వివిధ దశల్లో ఉన్నందున వీటిపై ప్రత్యేక దష్టి కేంద్రీకరించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద మంజూరు చేసిన 278 పనులలో 29 పనులు ఇంకా ప్రారంభించలేదన్నారు. వీటికి సంబంధించి వెంటనే గ్రౌన్డింగ్ పనులు చేపట్టాలని, పురోగతిలో ఉన్న 123 పనులకు సంబంధించి తేదీల వారీగా లక్ష్యాలను రూపొందించి గురువారం లోపు వివరాలను అందించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో కాలనీలలో 84 ఆర్చీల నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పురోగతిలో ఉన్న 11 ఆర్చీలను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయితీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ బ్రహ్మయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రమేష్, ముత్యంబాబు, డిప్యూటీ, అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
జల్‌జీవన్‌మిషన్‌పై కలెక్టర్ సమీక్ష
గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ, గుంటూరు శాఖకు సంబందించిన జల్ జీవన్ మిషన్ పనుల యొక్క పురోగతిని ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షిం చారు. నీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి నీటి కుళాయిని అందించాలన్నారు. టెండర్‌కు రాని పనులను టెండర్లు పిలిచి త్వరితగతిన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సురేష్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి