ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : నిర్మాణాలు పూర్తికావచ్చిన ప్రాధాన్యతా భవన నిర్మాణాలను వెంటనే పూర్తిచేసి సంబంధిత శాఖలకు అప్పగించాలని జిల్లా కలక్టరు నిశాంత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఎల్విన్‌పేటలో ప్రాధాన్యతా భవనాల నిర్మాణపనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే ప్రజలకు అవసరమైన సేవలన్నింటిని అందించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందుకు అవసరమైన భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చి భవనాలకు మంజూరు చేసిందని అన్నారు. నిర్మాణ పనులు ఆఖరి దశలో గల భవనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలని ఇంజనీరింగు అధికారులను అదేశించారు. నిర్మాణపనులకు అనుకూలమైన సమయమని కావున సాధ్యమైనంత త్వరగా భవనాలు పూర్తిచేసి, సంబంధిత శాఖలకు అప్పగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగు అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










