ప్రజాశక్తి - కురుపాం : మండలంలో మొండెంఖల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అదనపు భవన నిర్మాణ పనులను ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను క్షుణంగా పరిశీలించి, వాటి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు లేకుండా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి జె.శాంతీశ్వరరావు, డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాల సందర్శన
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని టిక్కబాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను పార్వతీపురం ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వార్డెన్ అప్పారావును అడిగి తెలుసుకున్నారు.










