Jun 06,2023 00:18

సంతకాలు సేకరిస్తున్న నాయకులు

గుంటూరు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు బకాయి ఉన్న క్లైమ్స్‌ను విడుదల చేయాలని, సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించాలని గుంటూరు నగర భవన నిర్మాణ కార్మిక సంఘం(సిఐటియు) ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాసింవలి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కంకర గుంట గేటు సెంటర్‌లో భవన నిర్మాణ కార్మికుల సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భవన నిర్మాణ కార్మికులకు బోర్డు నుంచి రావా ల్సిన సంక్షేమ పథకాలు నిలిపివేసి, ఆ నగదును ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించిందని, కార్మికుల సం క్షమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. సంక్షేమ బోర్డు కొనసాగించాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు దొడ్డా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఆది నికల్సన్‌, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.