Nov 06,2022 23:42

ఆర్థికసాయాన్ని అందిస్తున్న తోటి కార్మికులు

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడిని నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన శ్రీ వినాయక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సేవా సంఘం సభ్యుడు కొల్లు బాబులుకు తోటి కార్మికులు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి, ఉపాధికి దూరమైన ఆయనకు తోటి కార్మికులు రూ.ఐదువేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్బంగా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎల్‌వి. రమణ మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల కార్మికులు ప్రమాదాల బారిన పడి ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో బోర్డు నుంచి ఎటువంటి ఆర్థికభరోసా లేని దుర్భర పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పధకాలు అందక కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఇలాగే అనేక కుటుంబాలు రోడ్డు పడ్డాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తోటి కార్మికులంతా అండగా నిలవడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అల్లు ఎరుకునాయుడు, రుత్తల బాబులు, పారుపల్లి రామకృష్ణ, ఆళ్ల సత్తిబాబు, పిండి శ్రీను పాల్గొన్నారు.