సత్తెనపల్లి రూరల్: కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా నిర్మాణ కార్మి కులందరికి పథకాలు అందజేయా లని భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ మంత్రి అంబటి రాం బాబుకు వినతిపత్రం అందజేసేందుకు సోమవారం ప్రదర్శనగా వెళుతున్న కార్మి కులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి లేరని, ప్రదర్శ నకు అనుమతి లేదని పట్టణ సిఐ యు.శోభన్‌బాబు అడ్డు కున్నారు. మంత్రి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు ఐదుగురిని మాత్రమే వారు అనుమతిచ్చారు. ప్రసాద రావు ఆధ్వర్యంలో మంత్రి కార్యా లయంలో వినతిపత్రం అంద జేశారు. అనంతరం పట్టణ సిఐ శోభన్ బాబు కూడా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పదిహేనేళ్ల పాటు భవన నిర్మాణ కార్మికుల పోరాటాల ఫలితంగా 1996 అప్పటి కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందని, .2009లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఈ చట్టాన్ని అమలు చేశా రని గుర్తుచేశారు. కార్మికులు సహజ మరణం పొందితే రూ.80 వేలు, ప్రమా దంలో చనిపోయిన కార్మికులకు రూ.5 లక్షల 20 వేలు అందజేసే వారని, ప్రసూతి సహాయం, పెళ్లి కానుక, పిల్ల లకు ఉపకార వేతనాలు అందచేసే వారిని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అది óకారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ నిధులను దారి మళ్లించి, సంక్షేమ పథకాలు రద్దు చేస్తూ జీవో నెం1214 తీసుకొచ్చి నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శిం చారు. ఈ జీవోను రద్దు చేసి సంక్షేమ పథకాలు అందజేయా లని ప్రసాదరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు షేక్ సైదా, సాల్మన్ రాజు పాల్గొన్నారు.










