సత్తెనపల్లి రూరల్: ఇసుక కొరత, కరోనా సమయంలో మరణించిన భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలని ఎపి బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూని యన్ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తెనపల్లి పుతుంబాక భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమ ర్శించారు. ఇసుక కొరత కారణంగా అనేక మంది కార్మి కులకు పనులు లేక ఆకలితో అలమటించి మరణిం చారని, అలాగే కరోనా సమయంలో కూడా మృతి చెందారని, వారందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాల్సిన సంక్షేమ నిధులను ప్రభుత్వం దారిమళ్ళించి కార్మికులకు అన్యాయం చేసిందని అన్నారు. కార్మిక శాఖ ద్వారా. కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందచేస్తున్న పథకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 1214 తీసుకొచ్చిందని, తక్షణం దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాల అసెంబ్లీలో సమావేశాల్లో భవన నిర్మాణ కార్మి కుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు కు సోమవారం వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. లక్కరాజుగార్లపాడు సెంటర్ నుండి ప్రదర్శనగా వెళ్లి వినతిపత్రం అందజేసే కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ సైదా, పట్టణ కార్యదర్శి జి. సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.










