Sep 13,2023 19:06

ర్యాలీ నిర్వహిస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :కేరళ, తమిళనాడు తరహాలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం, సిఐటియు మండల నాయకులు వేగూరు వెంకయ్య, మారుబోయిన రాజా డిమాండ్‌ చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో నెల్లూరు లోని జట్టి శేషారెడ్డి జ్ఞాన కేంద్రంలో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ సమావేశాలను పురస్కరించుకొని బుధవారం మండలంలోని నరుకూరులో భారీ ర్యాలీ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అన్నం పుట్టయ్య, మారుబోయిన వెంకట శేషయ్యల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వెంకయ్య, రాజా పాల్గొన్నారు.