పల్నాడు జిల్లా: భవన నిర్మాణ కార్మికులకు 2009 నుండి అమలవుతున్న సంక్షేమ పథకాలను, వైసిపి అధికారంలో ఉన్న నాలు గున్నరేళ్లలో వాటిని నిలుపుదల చేసిందని, తిరిగి ప్రారంభిం చాలని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీని వాస రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిలార్ మసూద్ మాట్లాడుతూ సహజ మరణం, ప్రమాద మరణం తాత్కాలిక వైకల్యం, పెళ్లి కానుకలు, వివాహ కానుకలు, వృత్తి నైపుణ్య శిక్షణ స్థైఫండ్, రిజిస్టర్ కానీ భవన నిర్మాణ కార్మికుల పరిహారాలు.. ఇటువంటి అనేక పరిహారాలను భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలు చేశారని గుర్తుచేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 1214 మెమో ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నింటిని నిలుపుదల చేసిందని విమర్శించారు. దీని వల్ల నరసరావుపేట నియోజక వర్గంలో సుమారు 3,000 మంది లబ్ధిదారులు సంక్షేమానికి దూరంగా ఉన్నారని, నియోజకవర్గం మొత్తం మీద 20 వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ సంక్షేమానికి దూరమవుతున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించి, సంక్షేమ బోర్డు ద్వారానే వారికి లబ్ధి చేకూర్చాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో సంఘం నరసరావుపేట మండల కార్యదర్శి కె.సురేష్, పట్టణ కార్యదర్శి కె.కోటిరెడ్డి, రొంప ిచర్ల మండల కార్యదర్శి బి.బాలకోటయ్య పాల్గొన్నారు.
వినుకొండ: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు నిలిపివేసి తీరని అన్యాయం చేశారని పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు అవ్వరు ప్రసాద్ విమర్శించారు. సిఐటియు, సిడబ్ల్యూఎఫ్‌ఐ ఫిలుపు మేరకు ఆదివారం కార్మికులు ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. పదిహేనేళ్లపాటు పాటు దేశ వ్యాప్తంగా పోరాడి కేంద్రప్రభుత్వం చేత 1996లో భవన,ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పోరాడి సాధించుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ద్వారా వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణం చెందితే రూ80 వేలు, ప్రమాద మరణం చెందితే రూ.5లక్షల 20వేలు, కార్మికుని భార్య, ఇద్దరు కుమార్తెల ప్రసవాలకు ఒక్కొక్కరి కాన్పుకు రూ.20వేలు, (ఒక్కొక్కరికి రెండు కాన్పులు), కార్మికుని కుమార్తె వివాహానికి రూ.20 వేలు (ఇద్దరు కుమార్తెలకు) తాత్కాలిక అంగవైకల్యానికి రూ.9 వేలు, దీర్ఘకాలిక వ్యాధులకు తగు లబ్ధి వంటి తదితర సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుత ప్రభుత్వం వీటిని నిలుపుదల చేసిందని అన్నారు. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని శావల్యాపురం, వినుకొండ పట్టణం, మండలం, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల మండలాల్లోని సుమారు 20 వేల మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలకు గత నాలుగేళ్లుగా దూరమై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజక వర్గంలోని వేలాది లబ్ధిదారులకు సుమారు రూ.8 కోట్లు సంక్షేమ పథకాలు నిలిపివేశారని అన్నారు. కార్మికుల పట్ల చిత్తశుద్ధితో నియోజకవర్గంలో ఉన్న సుమారు 12 వేలమంది భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి 1214 మెమో రద్దు అయ్యేటట్లు, సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు చూడాలని వారు కోరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఎ అంజి బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎ.ఆంజనేయులు, సిఐటియు నాయకులు బి. వెంకటేశ్వర్లు, కె.నాసర్‌బి, బి.తిమ్మయ్య, శ్రీను, విరేబియా తదితరులు పాల్గొన్నారు.










