Aug 28,2023 00:20

చిలకలూరిపేట: భవన,ఇతర నిర్మాణ కా ర్మిక సంఘం పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వ హించారు. స్థానిక పండరీపురంలోని ఏలూరు సిద్దయ్య విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎం.విల్సన్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ పథకాలు, సంక్షేమ బోర్డుకు సం బంధించిన సమస్యల పరిష్కారానికి అడ్డంగా ఉన్న మెమో నెంబర్‌ 1214 రద్దు చేయాలని డిమాండ్‌ చేశౄరు. అర్హులైన కార్మికులందరికీ గుర్తింపుకార్డులు ఇచ్చి వారందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసే పోరాటంలో భాగంగా సెప్టెంబర్‌ నెల 5వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి రాధాకృష్ణ మాట్లాడుతూ కమ్యూ నిస్టులు పోరాటాలకు కార్మికుల పట్ల పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, వారి పోరాటాలు ఫలితంగా ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డుని ప్రవేశపెట్టి అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ బోర్డును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్మికులు చేసే పోరాటానికి తమ పార్టీ మద్దతు తెలియజేస్తోందని చెప్పారు. అనంతరం ఇసికె పార్టీ నాయకులు ముత్తయ్య , ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆడప మోహన్‌, సీమాంధ్ర శ్రేయస్‌ సంక్షేమ సమితి సాధన అధ్యక్షులు అల్లాబక్షు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ అధ్యక్షులు బాబు, సిఐటియు చిలకలూరి పేట మండల ప్రధాన కార్యదర్శి పేరుపోయిన వెంక టేశ్వర్లు, ఐద్వా మహిళ సంఘం నాయకురాలు భారతి, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు తోట రాజా రమేష్‌, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్ర హ్మణ్యం, బిరుదు లక్ష్మణ్‌ తో పాటుగా ప్రజా సంఘాల ప్రతి నిధులు పాల్గొని ప్రసంగించారు.