ప్రజాశక్తి-రాజవొమ్మంగి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా నాయకులు పి.రామరాజు పిలుపునిచ్చారు. బుధవారం రాజవొమ్మంగిలో భవననిర్మాణ కార్మికుల మండల మహాసభ పి.శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రూ.800 కోట్లు వారికే ఖర్చు చేయాలని, పెండింగ్ క్లైములు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా కలవపల్లి రాంబాబు, పప్పల శ్రీను, ఆఫీస్ బేరర్స్‌గా ఎస్.నాగు, వి.భద్రం, ఎన్.రామకృష్ణ, పి.ప్రసాద్, డి రాము, మరో 10మంది కమిటీ సభ్యులుగా ఎన్నికైయ్యారు, ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పండు, జి.శ్రీను, వై శివ, సీహెచ్ రాంబాబు, ఎం శ్రీనివాస్, ఎన్ అచ్చారావు తదితరులు పాల్గొన్నారు.










