
ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను వెంటనే విడుదల చేయాలని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మీనా రాయణ డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక సంజీవయ్య నగర్ హైస్కూల్ వద్ద జరిగిన గుంటూరు భవన నిర్మాణ కార్మిక సంఘం తూర్పు కమిటీ మహాసభలో ఆయన మాట్లా డారు. భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. సంక్షేమ బోర్డులోని కార్మికుల డబ్బులను మిగులు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలను వినియోగి ంచటం సరికాదన్నారు. బోర్డు ద్వారా రావలసిన క్లైమ్స్ కోసం అర్జీదారులు ఎదురుచూస్తున్నారని, తక్షణమే విడుదల చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ అజెండాలో పెట్టాలన్నారు. సిఐటియు తూర్పు కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఉపాధి తగ్గటానికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. సిమెంటు, ఇనుము, కంకర, ఇసుక ధరలు నిర్మాణదారులకు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నాని చెప్పారు. డిసెంబర్ నుండి రాష్ట్ర రాజధాని విశాఖపట్నంకు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో అమరావతి రాజధాని ప్రాంతంలో బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. దీంతో కార్మికుల ఉపాధి మరింత తగ్గిందన్నారు. మరోవైపు ఉపాధి అవకాశాలు లేని భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవటానికి ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని, సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సంక్షేమ బోర్డును రక్షించుకోవాలని పిలుపుని చ్చారు. మహాసభకు తూర్పు కమిటీ అధ్యక్షులు పి.దీవెనరావు అధ్యక్షత వహించగా సిఐటియు తూర్పు, పశ్చిమ కమిటీల అధ్యక్షులు టి.రాధా, బి.సత్యనారాయణ ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె బాష, భవన నిర్మాణ కార్మిక సంఘం పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. ఖాసీం వలి, సిఐటియు తూర్పు కమిటీ ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు ప్రసంగించారు. తొలుత సంఘం జెండాను సీనియర్ నాయకులు నక్క మస్తానరావు, సత్యనారాయణ, గాబ్రియల్ ఆవిష్కరించారు. ప్రజానాట్యమండలి నాయ కులు జి.లూథర్‌పాల్ గేయాలు ఆలపించారు. అనంతరం 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మైల ముత్యాలరావు, పచ్చిగొర్ల దీవెనరావు, కోశాధికారిగా తాడిబోయిన శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులుగా కె.శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీతయ్య, సారధి, బుజ్జి, మల్లేశ్వరరావు, సుబ్బరాయుడు పాల్గొన్నారు.