Jul 16,2023 23:23

కార్మికుడికి ఆర్థిక సహాయం

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌:గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భవన నిర్మాణ కార్మికుడు కొర్ర శ్రీను విశాఖపట్నం కేజీహెచ్‌ లో అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు అరకువేలి మండల కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, చిరు వ్యాపారస్తులు సహకారంతో ఇరవై మూడు వేలు సేకరించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, తేజవలీ, పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గోపి, సహాయ కార్యదర్శి దాసు, రాజేంద్ర, కొండలరావు చేతులు మీదుగా అందించారు.