
ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి జోన్- 2 పరిధిలో సిఐటియు అనుబంధంగా శ్రీకృష్ణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఏర్పాటైంది. కొమ్మాది కూడలిలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం విధివిధానాలను రూపొందించుకొని, కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షులు, సలహాదారులుగా సిఐటియు నాయకులు పి.రాజుకుమార్, ఎ.నీలయ్య, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎ.లక్ష్మణరావు, కె.రమణ, కార్యదర్శులుగా ఎం.సత్యం, ఎస్.రమణ, కోశాధికారిగా కె.లక్ష్మణ, కమిటీ సభ్యులుగా ఎ.నరసింగరావు, కె.చిన్నప్పన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జోన్ ఉపాధ్యక్షులు డి.అప్పలరాజు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంతో పాటు వారి హక్కుల కోసం సంఘం నిలబడాలని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యంచేసిందన్నారు. సంక్షేమ బోర్డు నిధులు వెనక్కి తెచ్చుకునేందుకు చేసే పోరాటాల్లో సంఘ సభ్యులు భాగస్వామ్యం కావాలని కోరారు. వీటితో పాటు ప్రజా హిత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్.ధనుంజయ, జి.అప్పలనరసయ్య, ఎం.శ్రీను, జి.భద్రయ్య, ఎన్.శంకర్, వై.రాజు తదితరులు పాల్గొన్నారు.