ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్ క్లెయిములను విడుదల చేయాలని కోరుతూ శనివారం ధర్నా చేశారు. అచ్చంపేటలోని పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్పకు అనంతరం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింతల సత్యనారాయణ మాట్లాడారు. 2007 నుంచి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన సంక్షేమ పథకం జగన్ మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిలిపివేశారని తక్షణమే పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్ క్లయిములు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం రూ.1200 కోట్లు ఉంటే రూ.2400 కోట్లు ఖర్చు పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నిధులను వాడుకున్నదని తక్షణమే ఆ నిధులు జమ చేయాలని, ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ఉచిత బస్, గహ నిర్మాణ రుణం 75 శాతం ఉచితంగా అందిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మోటార్ సైకిళ్లను వాయిదాల పద్ధతిలో అందించినదని చెప్పారు మన రాష్ట్రంలో మాత్రం పథకం నిలిపి వేశారని తక్షణమే ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని 50 ఏళ్లు దాటిన వారికి రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సామర్లకోట మండల ప్రధాన కార్యదర్శి ఎన్.సురేష్, పెద్దాపురం సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సామర్లకోట మండల అధ్యక్షులు ప్రకతి ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పెనుపోతుల సత్తిబాబు, పెదబ్రహ్మదేవం అధ్యక్షులు పేపకాయల ప్రసాద్, వేట్లపాలెం నాయకులు కె.రామారావు, ఎస్‌కె.భాపన్ సాహెబ్, మాధవపట్నం నాయకులు కాళ్ల లోవబాబు, ఎస్‌కె.ఖాజా, నవర నాయకులు కన్నె వీరబాబు, పెద్దాపురం నాయకులు గడప వీరబాబు, ముమ్మన శ్రీను, పూసల సుబ్బారావు, నీలపాల కష్ణ, పాలపత్రి వీరబాబు, పాండవగిరి పెయింటింగ్ యూనియన్ కరణం అప్పారావు, వడ్డి సత్యనారాయణ, రాచపల్లి చంద్రశేఖర్, యాసలపు మహేష్, ఎలక్ట్రీకల్ యూనియన్ తాడిశెట్టి గంగాధరరావు, ఎస్‌కె.బాషా పాల్గొన్నారు. నాయకులు










