
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
స్థానిక తాడితోటలో గల భవిత ఉపకేంద్రంలో వికలాంగ విద్యార్థులకు ట్యాబ్‌లను సోమవారం కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెన్షన్లపై విద్యార్థుల తల్లిదండ్రులను ఆరా తీశారు. జిల్లా సమగ్ర శిక్షా కో-ఆర్డినేటర్ కనకబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్‌లో నలుగురు విద్యార్థులకు, ముగ్గురు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లను అందించామన్నారు. ఈ ట్యాబ్‌లలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 17 రకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేశామన్నారు. వీటి వినియోగంపైనా శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ ఎస్.అబ్రహాం, అర్బన్ రేంజ్ డిఐ బి.దిలీప్‌కుమార్, సమగ్ర శిక్షా ఎకౌంటు ఆఫీసర్ జె.స్నేహలత, భవిత ఉపకేంద్రం ఐఇఆర్‌పిలు దారా చిట్టి, బి.మేరీరాణి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల స్పెషల్ ఎడ్యుకేటర్ తిరుపతి రాజు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.