Jun 27,2023 22:01

ఫొటో : టిడ్కో గృహల వద్ద సెల్ఫీ ఛాలెంజ్‌ చేస్తున్న టిడిపి నాయకులు

'భవిష్యత్తుకు గ్యారంటీ - చైతన్య యాత్ర'
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర టిడిపి పిలుపునిచ్చిన ''భవిష్యత్తుకు గ్యారంటీ - చైతన్య రధయాత్ర'' కార్యక్రమాన్ని మంగళవారం కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి మహిళా నేతలందరూ హారతులు పట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయంలో అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి, రానున్న టిడిపి ప్రభుత్వంలో వాటిని పరిష్కరించేందుకే టిడిపి ''భవిష్యత్తుకు గ్యారెంటీ- చైతన్య యాత్ర'' కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
తొలుత ట్రంక్‌ రోడ్డులోని ఎన్‌.టి.ఆర్‌. విగ్రహం వద్ద పూలమాలలు వేసి, నివాళులర్పించి బయల్దేరారు. అనంతరం కలుగోళ శాంభవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ నుండి పెద్ద పవనిరోడ్డు లోనిఓవర్‌ బ్రిడ్జి, పూర్తయినా, అప్రోచ్‌ రోడ్డు వేయించలేదని గుర్తించి, దానిని తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తమ హయాంలో పూర్తి చేయిస్తామని తెలిపారు. కావలి పట్టణ మద్దూరుపాడు 1వ వార్డులో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించబడిన టిడ్కో గృహాలను ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వ పైశాచికత్వానికి నిదర్శనంగా మారిన టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. కావలి రూరల్‌ మండలంలోని రుద్రకోట వద్ద జరుగుతున్న గ్రావెల్‌ మాఫియాపై సెల్ఫీ చాలెంజ్‌ విసిరి, ధ్వజమెత్తారు. కార్యక్రమంలో భాగంగా కావలి రూరల్‌ మండలం, అన్నగారిపాలెం పంచాయతీ, పూలదరువు గ్రామంలోకి చేరుకున్న సందర్భంగా స్థానికులు టిడిపి నేతలకు నీరాజనాలు పలికారు. పూలదరువు సెంటర్‌లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఘనమైన నివాళులర్పించారు. కార్యక్రమానికి మాజీ ఎం.ఎల్‌.ఎ. కంభం విజయరామిరెడ్డి, మాజీ జెడ్‌.పి. చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, జెన్నీ రమణయ్య, బొమ్మిసురేంద్ర హాజరయ్యారు. టిడిపి నేతలు డాక్టర్‌ ఏగూరి చంద్రశేఖర్‌, గుత్తికొండ కిషోర్‌ బాబు, మొగిలి కల్లయ్య, జి.శ్రీదేవి చౌదరి, పోతుగంటి అలేఖ్య, చల్లంచర్ల రాజా, ద్రోణాదుల వాసంతి, చిట్టాబత్తిన మాల్యాద్రి, మాలేపాటి నాగేశ్వరరావు, లేళ్లపల్లి సుధీర్‌, బొట్లగుంట శ్రీహరి నాయుడు, పల్లపు మోహన్‌, కమ్మిశెట్టి రమణయ్య, దామా మాల్యాద్రి నాయుడు, అమరజ్యోతి, షేక్‌.మస్తాన్‌, పైడి హర్ష, కావేటి కోటయ్య, షేక్‌.రఫీ, తదితరులు పాల్గొన్నారు.