Nov 03,2023 20:54

జియ్యమ్మవలస మండలంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - సీతంపేట :  మండలంలోని రామనగరం,గొలుకుప్ప, చింతమానుగూడ, పెద్దగూడలో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యమని పార్టీ క్యాడర్‌ కు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, గేదెల కాంతారావు, మండల ప్రధాన కార్యదర్శి బిడ్డిక అప్పారావు, బిడ్డిక సుబ్బారావు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ ఐటీడీపి కోఆర్డినేటర్‌ హిమరక పవన్‌, ప్రచార కర్త తోయిక సంధ్యారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని గొట్టివలసలో మండల టిడిపి అధ్యక్షులు అక్కేన మధుసూదనరావు ఆధ్వర్యంలో బాబు ష్యూర్టీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి తోయక జగదీశ్వరితో పాటు, పలువురు టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎం.పురుషోత్తమునాయుడు, ఎం.తవిటినాయుడు, ఎంబి విజయవాంకుశం అంబటి తవిటినాయుడు (రాంబాబు), స్థానిక సర్పంచ్‌ బోను చంద్రి నాయుడు, పెద్దింటి పూర్ణచంద్రరావు, కోట సుమన్‌, బొచ్చ జగదీష్‌, ఎం.రామారావు, దామోదరరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.
వీరఘట్టం: మండల కేంద్రమైన వీరఘట్టంలోని కూరాకుల, తెలగ వీధుల్లో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, మండల ప్రధాన కార్యదర్శి చింత ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మండల తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల అనిల్‌, బల్ల హరిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మక్కువ : మండలంలోని కొయ్యనుపేట పంచాయతీలో టిడిపి బాబుతో ష్యూర్టీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జి.వేణుగోపాలరావు, సీనియర్‌ నాయకులు ఎం.ప్రసాదరావునాయుడు, పలువురు టిడిపి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం జోగులడుమ్మలో బాబు ష్యూర్టీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టిడిపిని గెలిపిస్తే భవిష్యత్తు భరోసా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్‌, అరుకు పార్లమెంట్‌ ఎస్‌టి సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.