ప్రజాశక్తి - పాలకొండ రూరల్ : పాలకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పాలకొండ టౌన్ పరిధిలో భవిష్యత్తుకు గ్యారెంటీ మహాశక్తియాత్ర కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ మహిళలకు భద్రత అయిన భరోసా అయినా ఆర్థిక అండగా ఇవ్వగల ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ పార్టీ అధ్యక్షులు గంట సంతోష్, అడపా బాబ్జీ, అంపోలు శ్రీను, వండన సంతు, సారిపిల్లి సంతోష్ కుమార్, కాశిం, బెజ్జిపురం శ్రీరాములు, లక్మి, పార్వతి, భవాని, ఈశ్వరమ్మ, రాజేశ్వరి, టౌన్ ముఖ్య నాయకులు, స్థానిక మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొగదారిగూడలో...
సీతంపేట : గిరిజనుల భవిష్యత్తు బాగుండాలంటే టిడిపి పాలన రావల్సిందేనని పాలకొండ నియోజకవర్గ టిడిపి నాయకులు పడాల భూదేవి అన్నారు. మండలంలోని మొగదారిగూడలో ఆదివారం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తిపై అవగాహన కల్పించారు. 2024లో టిడిపికే పట్టం కట్టాలని కోరారు. మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు గూర్చి వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆరిక లచ్చుమయ్య, స్థానిక వార్డుమెంబర్ సవర బంగారయ్య, సవర మోహన్‌పాల్, సవర కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.
కుమ్మరి గండిలో...
మండలలోని కుమ్మరిగండి పంచాయతీ పరిధిలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు ఆధ్వర్యంలో మహాశక్తియాత్ర ప్రచారకర్త తోయక సంధ్యారాణి ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కుమ్మరిగండి పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పరిష్కారమవుతాయన్నారు. కావున నిమ్మక జయకృష్ణను గెలిపించుకుంటేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో తోయిక సంతు, వరలక్ష్మి, సవర సూర్యం, సవర సంతు, సవర మోహన్, సవర తిక్కమ్మ, సరోజిని, అప్పలమ్మ, సుండమ్మి, సుందరి, మంగమ్మ, చంద్రమ్మ, మల్లమ్మ, పార్వతి, పలువురు మహిళలు పాల్గొన్నారు.










