Jul 31,2022 23:14

భారాలను నిరసిస్తూ టిడిపి ర్యాలీ

ప్రజాశక్తి -భీమునిపట్నం: ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపిదే విజయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆశాభావం వ్యక్తంజేశారు. జివిఎంసి మూడో వార్డులో ఆదివారం టిడిపి ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజలపై ఇప్పుడున్న స్థాయిలో ఆర్థిక పరమైన భారాలు మోపలేదని వివరించారు. చెత్త పన్ను విధింపు, ఆస్తి పన్ను పెంపు, ఆర్‌టిసి బస్సు చార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టిడిపి ముద్రించిన బాదుడే బాదుడు కరపత్రాలను ఇంటింటికీ, కాయగూరలు అమ్మే వ్యాపారులకు అందజేశారు. భారాలను నిరసిస్తూ వార్డులో ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్‌ గంటా అప్పల కొండ, పార్టీ వార్డు అధ్యక్ష, కార్యదర్శులు గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర కుమార్‌, ఉపాధ్యక్షులు ఎం.సంజీవ్‌కుమార్‌, యువజన విభాగం అధ్యక్షులు కనకల అప్పలనాయుడు, మాజీ జెడ్‌పిటిసి సరగడ అప్పారావు, జివిఎంసి నాలుగో వార్డు అధ్యక్షులు పాసి నరసింగరావు పాల్గొన్నారు.