Oct 09,2023 21:29

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమేష్‌

ప్రజాశక్తి - వీరఘట్టం : ఉపాధ్యాయుల జీవితాలు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవు బకాయిలు స్కూలు గ్రాంటు, ఎంఆర్‌సి సిబ్బంది సిఆర్‌పిల జీతాల జిపిఎస్‌ రద్దు కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ అన్నారు. మండలంలోని తాలవరం, పనస నందివాడ, ఎంవిపురం, కుమ్మరిగుంట, నీలానగరం, బిటివాడ, వండువ, చిదిమి, పాలమెట్ట, డిపి వలస, సిబిఎం వలస, ఆడారు, పాపంపేట, బొడ్లపాడు, తూడి, ఎం.రాజుపురం, యు.వెంకంపేట, కత్తుల కవిటి, రేగులపాడు, హుస్సేన్‌పురం, తదితర పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, మండల అధ్యక్షులు బి.దుర్గాప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి కె.గోవిందరావు, సీనియర్‌ నాయకులు ఎస్‌.మహేష్‌, ఎ.స్వామిబాబు, కె.గౌరునాయుడు, ఎ.చంద్రమోహన్‌, ఎస్‌ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.