
రాయచోటి టౌన్ : భవిష్యత్తును నిర్మించేది ఉపాధ్యాయులేనని లయన్స్ క్లబ్ రాయచోటి టౌన్ అధ్యక్షులు కె. నిర్మల్ కుమార్ అన్నారు. మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకష్ణ జయం తిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు పట్టుదల క్రమ శిక్షణతో చదువు కుంటూ ఉన్నతమైన లక్ష్యాలను అధిరోహిం చాలన్నారు. ప్రతి ఒక్కరూ సర్వే పల్లి రాధాకష్ణన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ పిఎస్ హరినాథ్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ లయన్ వి.నారా యణరెడ్డి, లయన్ రామాంజ నేయులు లయన్ రవి లయన్ ప్రకాష్ రెడ్డి సన్‌రైస్ స్కూల్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, హెడ్‌మాస్టర్ రెడ్డప్ప రెడ్డి, నాగేంద్ర, నందిని ట్రావెల్స్ వినోద్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.నందలూరు : భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్135వ జయంతి సందర్భంగా మండలంలోని నాగిరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిరవహించారు. ప్రధానోపా ధ్యాయురాలు జయలలిత కుమారి, ఎంఇఒ నాగయ్య, ఉపాధ్యాయులు పాల్గొని సర్వేపల్లి రాధాకష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యా యులు ఖాదర్‌బాషా, డాక్టర్ నాగేంద్రప్రసాద్, ఆనందాచారి, జీవి ప్రసాదరావు, గంగనపల్లి వెంకటరమణ, బోగా వెంకట సుబ్బ య్య, నాగశెట్టి లక్ష్మీనారాయణ, రవిశంకర్‌రెడ్డి, స్వర్ణలత, విజయ కుమారి, గౌరీ, సుబ్బరాయుడు, మస్తాన్, ఎం. రమణమ్మ, జ్యోతి ప్రియ, ఆర్.వి. రమణమ్మ, జివి.రమణ, ప్రమీల రాహేల్, షాకీర్ హుస్సేన్, పెంచలయ్యలను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కలకడ : మండలంలో గురుపూ జోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు రకాల ప్రభుత్వ ప్రయివేట్ గురుపూజోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో అన్ని పాఠశాలల యందు సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజంపేట అర్బన్ : నవ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డిబిఎన్‌పల్లె ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు సుబ్బయ్య, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, స్వర్ణలత, మాదాలస గీతలను శాలువా, పుష్పమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నాగేంద్ర, వెంకటసుబ్బయ్య, జికె.నాగరాజు, నగేష్ పాల్గొన్నారు. బి.కొత్తకోట : మండలంలోని బాలసానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, చెన్నకేశవులను విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలసి ఘనంగా సన్మానిం చారు. వారి సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి నరసింహులు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శివుడు నాయక్ దంపతులు నరసప్ప పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని బిపి శేషయ్య సంస్కత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ శాంతయ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోసాల దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మురళీ, సహాయ ప్రధాన ఉపాధ్యా యుడు వరదారెడ్డిలను శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పుల్లంపేట కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షుడు బొమ్మన నాగరాజు, పుల్లంపేట యూత్ అధ్యక్షుడు సిగమాల రవి, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలికిరి : మండలంలోని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలికిరి క్రాస్ రోడ్ చదివేవాళ్ళపల్లి ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు. కలకడ: మండల కేంద్రమైన కలకడ ఆదర్శ పాఠశాలలో సర్వేపల్లి రాధాకష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన్ మస్తాన్ అహ్మద్ హాజరై సర్వేపల్లి రాధాకష్ణ ప్రపంచం లోనే గొప్ప వ్యక్తి అని ఉపాధ్యాయ వత్తి చేపట్టి విధ్యార్థులకు విద్యా బుద్దులు నేర్పి దేశంలో అత్యున్నత పదవి చేపట్టి సమాజానికి విలువలు నేర్పారని అన్నారు. ప్రిన్సిపల్ మలాంషావలి ఉపాధ్యాయులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేని నివాళి అర్పించారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు శాలువా కప్పి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకున్నారు.రైల్వేకోడూరు : నియోజకవర్గం పెనగలూరు మండలం చక్రంపేట జడ్‌పి హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు గోపాలకష్ణ ఆధ్వ ర్యంలో అక్షర జ్ఞాన సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు డి అన్వర్ భాషా ని సన్మానించారు. తదుపరి గోపాలకష్ణ గారికి రాయచోటి లయ గార్డెన్స్ నందు జిల్లాఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా చక్రంపేట ప్రధానోపాధ్యాయులు గోపాలకష్ణను కలెక్టర్ గిరీషచే సన్మానం అందుకున్నారు.పుల్లంపేట : మండల కేంద్రంలోని ప్రత్యూష హైస్కూల్లో ముందస్తు కష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ చందన్‌బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కతి సంప్రదాయాలు తెలియజేసేందుకే పాఠశాలలో కష్ణాష్టమి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చందనబాబు, ఉపా ధ్యాయులు నరసింహులు, రవి, వాసు, సురేష్, సుధాకర్, రాధ పాల్గొన్నారు.ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో: గురువులందించే జ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కరస్పాండెంట్ ఆర్.గురుప్రసాద్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమాదేవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.వెలుగు సంస్థలో : మదన పల్లె మండలం కోళ్ళ బైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు ప్రత్యేక పాఠశాలలో ఉపాద్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వెలుగు కన్వీనర్ ఆర్.భాగ్యలక్ష్మి, వెలుగు ప్రిన్సిపల్ పి.లీనాకుమారి ముఖ్యఅతిధిగా విచ్చేశారు. మిట్స్‌లో : మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో టీచర్స్‌డేను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. యువరాజ్, అధ్యాపకులు శ్రీ సర్వేపల్లి రాధాకష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లక్కిరెడ్డిపల్లి : మానవతా సేవాసంస్థ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధకష్ణన్ జయంతి సందర్బంగా గురుపూజోత్సవాన్ని లక్కీరెడ్డిపల్లి మండల సభా భవ నంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిదులుగా మండల అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శనరెడ్డి, ఎంపిటిసి సైద్ అమీర్ మండల విద్యా శాఖ అధికారులు చక్రీనాయక్, వెంకటసుభయ్య మానవతా చైర్మన్ బాల సుబ్ర మణ్యం, మానవతా కేంద్ర కమిటీ సభ్యులు వై. ప్రసాద్ యాదవ్, కో చైర్మన్ శివశంకర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి ఆర్ శివయ్య, అధ్యక్షలు వివి. రమణా రావు, కార్యదర్శి రాముడు, కోశాధికారి రవిశంకర్ పాల్గొన్నారు. పందిళ్లపల్లి ఆదర్శపాఠశాలలో : విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణ ఆదర్శప్రాయులని పందిళ్ళపల్లి యుపిస్కూల్ ప్రధానోపా ధ్యాయులు బాల రాజు అన్నారు. సర్వేపల్లి రాధాకష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు స్థానిక పాఠశాలలో నిర్వహించారు. రాధాకష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్‌బాబు, వీరస్వామి, శిరీష, పద్మావతి, గంగాధర్, నాగార్జున విద్యార్థులు పాల్గొన్నారు. గాలివీడు : స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యా యులు కానాల శివరెడ్డిని మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సంద ర్భంగా డిసిసి బ్యాంక్ సిబ్బంది సన్మానించినట్లు సన్మానించిడం నోడల్ ఆఫీసర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమము పాఠశాల ప్రధాన ఉపాధ్యాయడు మొహిద్దిన్, డిసిసి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సివి.నారా యణరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ రెడ్డి శివప్రసాద్ పాల్గొన్నారు. నిమ్మనపల్లి : మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఆర్‌సి భవనంలో ఎంఇఒలు పద్మావతి, నారాయణ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథు లుగా ఎంపిపి నరసింహులు, వైస్ ఎంపిపి జయప్రకాశ్ రెడ్డి, ఆరక్ష్మి రమణారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, ఎంపిడిఒ శేషగిరిరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంఆర్‌సి సిబ్బంది, పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా సయ్యద్ సర్తాజ్
పుల్లంపేట : మండల పరిధిలోని టి.కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సయ్యద్ సర్తాజ్ హుస్సేన్ గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎంపిపి ముద్దా బాబుల్‌రెడ్డి, మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో మండల ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును ప్రదానం చేశారు. ర్యక్రమంలో తాసిల్దార్ నరసింహకుమార్, ఎంఇఒలు చక్రధర్‌రాజు, నాగ తిరుమల రావు, టీ.కమ్మపల్లి ఉపాధ్యాయులు రమణారెడ్డి, రమణయ్య, ప్రమీల మండల ఉపాధ్యాయ బందం నరేంద్ర, సిఆర్‌పిలు శివ పాల్గొన్నారు.
ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
రామాపురం : మండలం నుండి జిల్లాకు ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు ఎంఇఒ రామకష్ణుడు తెలిపారు. మండలంలోని బి.రాచపల్లి, నాయినివారిపల్లి, పాలన్నగారిపల్లె ఎంపిపి పాఠశాలలో పనిచేస్తున్న రామచంద్ర, విశ్వనాథ, వెంకట్రామిరెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.