Dec 19,2022 23:37

ప్రజాశక్తి-భవానీపురం: విజయవాడ నగర వాసులను అలరించడానికి జీవన్‌ సాగర్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ వారి తాజ్‌ మహల్‌ ఎగ్జిబిషన్‌ని సోమవారం 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ మండేపూడి చటర్జీ చేతులు మీదుగా ప్రారంభించారు. అన్ని వయస్సుల వారిని ఆహ్లాదకరమైన వాతావరణంలో భవానీపురం కష్ణా నది ఒడ్డున బొబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ లో ముందుగా ఎర్రకోట ప్రాకారం ఎంతో ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దారు. ఎర్రకోట ద్వారం దాటి ముందుకు వస్తే తాజ్‌ మహల్‌ కట్టడం అందరినీ ఆకట్టుకొంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో అత్యాధునిక ఎమ్యూజ్‌మెంట్స్‌ కొలంబస్‌, జెయింట్‌ వీల్‌, బ్రేక్‌ డ్యాన్స్‌, ఎంటర్‌ ప్రైజెస్‌, రివాల్వింగ్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. అలాగే చిన్నారుల కొసం క్యాటర్‌ పుల్లర్స్‌, హెలికాప్టర్‌, గుర్రాలు, రంగుల రాట్నం, వాటర్‌ బోటింగ్‌, జంపింగ్‌ మేరీ గ్రౌండ్‌, ఎయిర్‌ బౌన్స్‌ ర్‌, మినీ టోరా టోరా, తదితరాలు ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు హస్త కళలు, చేనేత వస్త్రాలు. సిమ్లా బజ్జి, స్పెషల్‌ ఫుడ్‌ కోర్టు, వినియోగదారుల అందుబాటులో ఉంటాయని నిర్వహకులు పోతుల కృష్ణ, అచ్చయ్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా న్యాయవాది బబ్బూరి భూపాల్‌, వై.యస్‌.ఆర్‌.సి.పి. యన్‌.టి.ఆర్‌. జిల్లా సీనియర్‌ నాయకులు కమ్మిలి రత్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.