ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి 19 తేదీ వరకూ నిర్వహించు శ్రీ అమ్మవారి భవానీ దీక్షా విరమణ నేపధ్యంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ దేవస్థానంలో ఈనెల 15 నుండి 19 వరకు నిర్వహించు శ్రీ అమ్మవారి భవానీదీక్షా విరమణ మహాోత్సవాలు-2022 ఏర్పాట్లులో భాగంగా వినాయక స్వామి వారి గుడి నుండి క్యూ లైన్లు, కేశఖండన, స్నానపు ఘాట్లు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలు తదితర ఏర్పాట్లను సబ్ కలెక్టర్ అదితి సింగ్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులకు సబ్ కలెక్టర్ వివిధ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ ఏసిపి కె. హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి, రెవిన్యూ, డిఎం అండ్ హెచ్‌ఓ ఇక్భాల్ హుస్సేన్, విఎంసి సర్కిల్-1 ఇఇ నారాయణరావు, ఇతర అధికారులు, మరియు ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.










