ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 15న నుండి 19వ తేదీ వరకూ నిర్వహించు శ్రీ అమ్మవారి భవానీ దీక్షా విరమణల నేపధ్యంలో శుక్రవారం విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం నందు 15 నుండి 19 వరకు (ఐదు రోజులపాటు) రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు భవానీలు మాలా విరమణకు రానున్న నేపధ్యంలో దుర్గగుడి అధికారులు వినాయకుని గుడి వద్ద నుండి కొండపైకి క్యూ లైన్లతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ అమ్మవారి భవానీదీక్షా విరమణ మహాోత్సవాల ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించి, ఆలయ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జోన్ ఏసిపి కె. హనుమంతరావు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సిఐ ఆర్. సురేష్ రెడ్డి, పోలీసు శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు లింగం రమాదేవి, ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.










