ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న భూ సర్వేలో ఎదురవుతున్న లోపాలను అధిగమించి పరిష్కరించాలని రెవెన్యూ కార్యదర్శులకు, విలేజ్ సర్వేయర్లకు తహశీల్దార్ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం ఆయన తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూ సర్వేలో ఎదురవుతున్న సమస్యలను జిల్లా వరకు రానివ్వకుండా మండల స్థాయిలోనే పరిష్కరించేలా కృషి చేయాలని జెసి నారపురెడ్డి మౌర్య ఆదేశించారని తెలిపారు. సర్వేలో తేలిన మిగులు భూములను పూర్తి అవగాహనతో ఆ కుటుంబం పూర్వాపరాలు, వంశ వృక్షం తెలుసుకున్న తర్వాతే పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యలపై రైతు అడిగిన వారికి పూర్తి అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. డిటి గుండాల నాయక్, సీనియర్ అసిస్టెంట్ మధు స్వామి, విఆర్‌ఒలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
విఆర్‌ఒ, సర్వేయర్ల సమావేశంలో మాట్లాడుతున్న తహశీల్దార్ లక్ష్మీనారాయణ










