
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా
జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూములకు సంబంధించి ప్రజల నుండి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. భూముల రీ సర్వే సాకుతో సర్వే పనులు చేయకపోతే చర్యలు తప్పవని సర్వే అధికారులను హెచ్చరించారు. జిల్లాలో స్పందన అర్జీలు వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాబ్‌మేళా క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డి.పి.ఓ దాసరి రాంబాబు, డ్వామా పి.డి శంకర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, వ్యవసాయశాఖ జె.డి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జె.డి హనుమంతరావు, మత్స్యశాఖ జె.డి సురేష్,జిల్లా రవాణా శాఖ అధికారి ఏ.చంద్రశేఖర్ రెడ్డి, పౌర సరఫరాల ఏ.ఎస్.ఓ విలియమ్స్, డి.ఎం శ్రీలక్ష్మి, బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఏ.భానుప్రతాప్ పాల్గొన్నారు.