ప్రజాశక్తి -అనంతగిరి : భూవివాదాల పరిష్కారానికి జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష, మీ భూమి-మా హామీ కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే దోహదపడుతుందని తహశీల్దార్ రాంభాయి అన్నారు. గురువారం మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ ఒరక్కఒడ్డు గ్రామం, కాశీపట్నం పంచాయతీ పందిరిమామిడివలస గ్రామంలో గ్రామసభలు నిర్వహించారు. అనంతగిరి తహశీల్దార్ రాంబాయితోపాటు జెడ్‌పిటిసి దీసరి.గంగరాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, జిపిఎస్ ఆధారిత సమగ్ర భూసర్వే ద్వారా దీర్ఘకాలిక భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. అనంతగిరి తహశీల్దార్ రాంబాయి మాట్లాడుతూ రెవిన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సంయుక్త భాగస్వామ్యం ఆధునిక సాంకేతికతో చేపట్టే రీసర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో చిలకలగెడ్డ సర్పంచ్ మజ్జి అప్పారావు, ఎంపిటిసి సభ్యులు తడబారికి. మెతుల సర్వేయర్ తేజేశ్వరావు, సెక్రటరీ వరలక్ష్మి, విఆర్‌ఒ పట్టాసిశంకర్రావు,కాశీపట్నం సర్పంచ్ జమ్మితి లక్ష్మీ సెక్రటరీ వై.రామస్వామి,విఆర్‌ఒ మానవతి, పాసిని శ్రీను, మాజి సర్పంచ్ దేముడు, సిపిఎం నాయకులు మామిడి.కష్ణ, ఎండుదొర పాల్గొన్నారు..










