అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 544డి, బిటిపి ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులు, బంజారా, ఎరుకల భవన్, రెసిడెన్షియల్ స్కూల్స్, డిజేబుల్ హోమ్, కార్పొరేషన్ కమ్యూనిటీ హాళ్లు, పర్యాటక శాఖ తదితర ప్రాజెక్టులకు భూసేకరణను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు గ్రంధి వెంకటేష్, రాణి సుష్మిత, సి.శ్రీనివాసులురెడ్డి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డిటిడబ్ల్యుఒ అన్నాదొర, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బుకొఠారి, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రసూల్, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ పాల్గొన్నారు.