రాయచోటి : జిల్లాలోని ముదివేడు, శ్రీనివాసపురం రిజర్వాయర్ లిఫ్ట్‌ఇరిగేషన్ గాలివీడు మండలంలోని సోలార్ పార్క్ పథకాలకు భూసేకరణ అవార్డ్స్ త్వరగా పూర్తి చేయడంతోపాటు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయా లని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల అంశాలపై సంబం ధిత తహశీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డిఒలు, ఇరిగేషన్, ఆర్‌డబ్లుఎస్, ఆర్‌అండ్‌బి, హౌసింగ్, విద్యుత్, సర్వే శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునీరు సమస్యలు అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఇందుకు ఆయా పథకాలకు సంబంధించిన భూసే కరణను త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యం గా ముదివేడు రిజర్వాయర్‌కు సంబంధించి 1075 ఎకరాలు అవసరం కాగా ఇందులో 425 ఎకరాలు భూసేకరణ చేసి అవార్డు పాస్ చేశారని చెప్పారు. అవార్డ్స్ పాస్ చేసిన భూమికి సంబంధించి లబ్ధిదారులకు త్వరగా పరిహారం పంపిణీ పూర్తి చేయాలన్నారు. వారంలోగా కురబలకోట, బి.కొత్తకోట మండలాల నుంచి అవార్డ్స్ పాస్ కోసం ఫైల్స్ కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిగిలిన భూసేకరణలో ప్రభుత్వ భూమి, పట్టా భూమి, డికెటి, అసై న్మెంట్ భూముల వివరాలను ఆయా తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. పట్టా భూములకు సంబంధించి ఫామ్-సిలో నివేదిక సమర్పించాలన్నారు. మార్గద ర్శకాల మేరకు మిగిలిన వాటిపై నివేదికలను సమర్పించాలన్నారు. శ్రీనివా సపురం రిజర్వాయర్‌కు సంబంధించి దాదాపు రూ.6.30 కోట్ల మేర పరిహారం పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సహాయ పునరావాస కార్యక్రమాలలో భాగంగా రహదారులు, నీటి సరఫరా, ఎలక్ట్రిఫికేషన్, పార్కు, టెంపుల్, కమ్యూనిటీ భవనం ఏర్పాటు తదితరాలలో చేపట్టిన చర్యలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లులలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్కుకు సంబంధించి ఇప్పటివరకు 1115 ఎకరాలు భూ సేకరణ చేయగా ఇంకనూ 208 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. సేకరించాల్సిన భూమిలో డికెటి, పట్టా, అసైన్‌మెంట్, ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి పరిహారం ఇచ్చారు. ఇంకా ఎంతమందికి చెల్లింపు చేయాలన్న విషయంలో సర్వేనెంబర్ వారీగా నివేదిక సమర్పించాలని సూచించారు. అవసరమైన భూసేకరణలో చుక్కల భూములుంటే వెంటనే సర్వే నెంబర్ వారీగా వాటిపై నివేదిక సమర్పించాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ -1 భూ సేకరణలో భాగంగా మదనపల్లి, మొలకలచెరువు, పిటిఎం, తంబళ్లపల్లిలలో మిగులు భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే మంగంపేటకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేసి త్వరగా అవార్డు పాస్ చేయాలని సంబంధిత తహశీల్దారును ఆదేశించారు. ఈ సందర్భంగా మంగపేట ఆర్‌అండ్‌ఆర లో భాగంగా చేపట్టిన పనులు ఏ దశలో ఉన్నాయని కలెక్టర్ అడుగగా సిసి రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, నీటి వసతి, గహ నిర్మాణాలకు మార్కింగ్, ఎలక్ట్రిఫికేషన్ తదితరాలలో పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నట్టు ఆయా శాఖల అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణలో ఒక కాల పరిమితి నిర్ణయించుకొని, ప్రణాళిక బద్దంగా నిర్దేశించిన సమయంలోగా భూసేకరణ పూర్తి చేసి జిల్లా అభివద్ధికి పాటుపడాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్‌డిఒలు రంగస్వామి, మురళీ, భాస్కర్, ఎస్‌డిసిలు, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్‌అండ్‌బి, హౌసింగ్, విద్యుత్, సర్వే శాఖల అధికారులు, సంబంధిత తహశీల్దార్లు పాల్గొన్నారు.










