మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి,
భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలో చేపట్టిన ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో వున్న భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి, సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి, వర్చువల్ గా అమరావతి నుండి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమావేశమై రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట (శ్రీకాకుళం జిల్లా) ఓడరేవుల నిర్మాణాలకు సంబంధించి అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి పెండింగ్ లో వున్న భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ పాల్గొని, రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ వివరాలను,పనుల పురోగతిని ప్రధాన కార్యదర్శి కి వివరించారు.ఈ సంధర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట ఓడరేవులకు సంబంధించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, అందుకనుగుణంగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో వున్న భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోర్టు ల నిర్మాణాల్లో భాగంగా భూ సేకరణ ప్రక్రియతో పాటు పునరావాస కాలనీలకు సంబందించిన భూసేకరణపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు










