రాయచోటి: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశిం చారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని విసి హాల్‌లో జిల్లాలోని జాతీయ రహ దారుల భూసేకరణ అంశంపై ఆర్‌డిఒలు, తహశీల్దార్లతో జెసి ఫర్మాన్ అహ్మద్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగులైన్ల జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎంత భూసేకరణ జరిగింది, ఇంకా ఎంత జరగాల్సి ఉంది, పరిహారం చెల్లింపు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఫైల్స్ పెండింగ్ లేకుండా ఆయా అంశాల వారీగా ఆర్డీవోలు, తహశీల్దార్లతో చర్చించి పరిష్కారం కోసం తీసుకో వాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.పెండింగ్ ఫైల్స్ పరిష్కారాన్ని ఎప్పటి కప్పుడూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాజంపేట, నందలూరు, పుల్లంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లిలో మండలాల వారీగా ఎన్ని ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత చెల్లింపులు చేయాల్సి ఉందన్న అంశంలో ఆయా తహశీల్దార్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరికి సంబంధించిన చెల్లిం పులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములకు సంబంధించి కోర్టులో కేసులుంటే ఆయా సర్వే నెంబర్లకు సంబంధించి డబ్బు కోర్టులో డిపాజిట్ చేయా లని సూచించారు. సేకరించిన భూమిలో ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే వాటిని గుర్తించి త్వరితగతిన ఫైనలైజ్ చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. రైల్వే, అటవీ పోరంబోకు, జెడ్‌హెచ్‌డిసి భూములకు సంబంధించి ప్రభుత్వ మార్గద ర్శకాలను పక్కగా పాటించాలన్నారు. ఏ అవార్డుకు ఎంత నగదు చెల్లింపు చేశా రన్న వివరాలను పక్కగా నమోదు చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో పురో గతి కనిపించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్‌డిఒలు రంగ స్వామి, మురళి, రామకష్ణరెడ్డి, ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
జిల్లాలోని అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలని కలెక్టర్ గిరీష అధ్యాపకులకు సూచించారు. స్పందన హాల్లో జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న ఒప్పంద డిగ్రీ అధ్యాపకుల సర్వీస్ రెన్యు వల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 46 మంది ఒప్పంద డిగ్రీ అధ్యాపకులు పనిచేస్తు న్నారన్నారు. వీరందరూ మంచి విద్య బోధన చేసి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి డిగ్రీ కళాశాల అభివద్ధికి విద్యార్థుల అభ్యున్నతికి కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధ్యా పకుల పనితీరును ఫలితాలను సమీక్షించి 46 మంది ఒప్పంద డిగ్రీ అధ్యాపకుల సర్వీస్‌ను 2023-24 విద్యా సంవత్సరానికి గాను రెన్యువల్ చేశారు. కార్య క్రమంలో జిల్లా ఐడి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.సుధాకర్‌రెడ్డి, జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపళ్లు, ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష










