Apr 11,2023 22:46

ప్రజాశక్తి కంచికచర్ల : కంచికచర్ల రైతు భరోసా కేంద్రం లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో , మండల మరియు గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులకు భూసార పరీక్ష - శిక్షణ వారం అనే అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భూసార పరిరక్షణ , మట్టి నమూనాలు సేకరణ తదితర ఆంశములపై శిక్షణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్‌ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసార పరీక్షలు రైతులు తప్పనిసరిగా చేయించి, వచ్చిన విశ్లేషణ ఫలితాలను బట్టి వివిధ పంటలకు ఎరువులను సిఫారసు చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి డివిజనల్‌ స్థాయి వరకు ఉన్న వివిధ వ్యవసాయ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో నైపుణ్యాతను పెంచుకొని క్షేత్రస్థాయిలో మిగిలిన అధికారులకు రైతులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆత్మ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నరశింహారావు, జిల్లా వనరుల కేంద్రం విజయవాడ అధికారిణి మాధవీలత, జిల్లా భూసార పరీక్ష కేంద్రం గొల్లపూడి సహాయ వ్యవసాయ సంచాలకులు పద్మజ, గరికపాడు కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త. వెంకట సుబ్బయ్య, జిల్లా వ్యవసాయ కార్యాల యం నుండి అనితభాను, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.