Apr 14,2023 00:00

అవగాహన కల్పిస్తు ఉమాప్రసాద్‌

ప్రజాశక్తి -నక్కపల్లి :రైతులు భూసార పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణంగా ఎరువులను వినియోగించాలని వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌ అన్నారు. మండలంలోని దేవవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఆర్‌బికే సిబ్బందికి భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి మట్టి నమూనాలు తీసే విధానంపై వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, మొక్కల పెరుగుదలకు 16 రకాల పోషక పదార్థములు అవసరమని, మోతాదుకు మించి పోషకాలు వాడితే పంట దిగుబడి తగ్గి, ఆదాయం తగ్గుతుందన్నారు. అధికంగా ఎరువులు వాడటంతో ఖర్చు కూడా ఎక్కువ అవుతుందన్నారు. మట్టి నమూనాలు సేకరించే టప్పుడు నేల రంగును, రకాన్ని బట్టి మెరక, పల్లాలను అనుసరించి మట్టి నమూనాను సేకరించాలని సిబ్బందికి సూచించారు