Jun 10,2023 00:35
భూసార పరీక్షలు గురించి రైతులకు వివరిస్తున్న వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ

ప్రజాశక్తి-అద్దంకి: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో భూసార పరీక్షలు, పచ్చిరొట్ట పైర్ల సాగుపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె వెంకటకృష్ణ, సిబ్బంది, ప్రెసిడెంట్‌ సందిరెడ్డి శ్రీనివాసరావు, సెక్రటరీ చిన్ని మురళీకృష్ణ, షేక్‌ మహమ్మద్‌ రఫీ, కురుగంటి హనుమయ్య, బొమ్మినేని వెంకటరావు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మనకు అనారోగ్యం వచ్చినపుడు టెస్టులు చేయించుకున్నట్లే భూసార పరీక్షలు ఎంతో అవసరమని, ఒక్క రూపాయి ఫీజు కూడా లేకుండానే అర్జీ పెట్టుకున్న వారి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు. పచ్చిరొట్ట ప్రాముఖ్యతను వివరించారు. రోటరీ క్లబ్‌ సేవలను అభినందించారు. అనంతరం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముకని, వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదని పేర్కొన్నారు.