వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
భూనిర్వాసిత రైతులకు
అవార్డు నోటీసులివ్వాలి
ప్రజాశక్తి-అనంతసాగరం:జాతీయ రహదారి 67లో భూ నిర్వాసితు రైతులకు అవార్డు నోటీసులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.పుల్లయ్య డిమాండ్ చేశారు.
భారత్ మాల పేరుతో జాతీయ రహదారి 67 నిర్మాణంలో కలువాయి మండలం లోని కనుపూరు పల్లి చిన్న గోపవరం తెలుగు రాయపురం గ్రామాల్లోని భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు అవార్డు నోటీసులు ఇవ్వాలన్నారు.కలువాయి తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 67 నిర్మాణంలో భూములు కోల్పోతున్నారు. రైతులకు భూ సేకరణ అధికారులు 2013 భూసేకరణ చట్టాల నిబంధనల విరుద్ధంగా రైతుల ఖాతాల్లో ఇటువంటి సమాచారం లేకుండా వారి అభిప్రాయాలు తెలుసు కోకుండా నామ మాత్రం నష్టపరిహారం జమ చేశారు. ఇది చాలా బాధాకరం. వాస్తవంగా ఆ గ్రామంలోని భూములు మార్కెట్ విలువ 15 లక్షలు నుండి 20 లక్షలు ఉండగా భూ సేకరణ అధికారులు మూడు లక్షలు నాలుగు లక్షలు చెల్లించడం దారుణమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ని రెండు పర్యాయంలో రైతులకు కలవడం జరిగింది. కలెక్టర్ మీకు నష్టపరిహారం సమ్మతం కాకపోతే ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకోండి అని అప్పుడు విచారించి పంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టప్రకారంగా చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆర్బిట్రేషన్ కొటేషన్ వేయాలంటే అవార్డు నోటీసులు కచ్చితంగా ఉండాలి కానీ రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు ఇప్పటివరకు రైతులకు ఇటువంటి నోటీసులు ఇవ్వలేదు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రైతులకు అవార్డు నోటీసువ్వాలని కోరుతున్నామని అన్నారు. కార్యక్రమంలో రైతులు మస్తానయ్య, హరిబాబు, పెంచలయ్య, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు.










