
ప్రజాశక్తి- కె.కోటపాడు
భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణపై గ్రామ సచివాలయ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ బంగారు వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందున ఆయా గ్రామాలకు చెందిన రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని తొమ్మిది గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రీ సర్వే గ్రామాల్లో సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పిఎం నెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయటానికి సచివాలయ కార్యదర్శులకు సరైన అవగాహన లేదు. దీంతో దేవరాపల్లి మండల చిన సోంపురం, ఎన్.గజపతినగరం, కె.కోటపాడు మండలం ఎ.భీమవరం, పోతన వలస అగ్రహారం, సూరెడ్డిపాలెం, డి.అగ్రహారం, రొంగల నాయుడుపాలెం, కేజే పురం గ్రామ సచివాలయ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు సబ్ రిజిస్ట్రార్ బంగారు వెంకటేశ్వరరావు మంగళవారం అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల రికార్డులు కార్యదర్శులకు అప్పగించారు.