ప్రజాశక్తి -మారేడుమిల్లి : మండలంలోని కుండాడ పంచాయితీ పరిధిలోని కడుమూరు, తూరుమామిడి గ్రామంలో గురువారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీ సర్వేపై గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గత సోమవారం రంపచోడవరం ఐటిడిఎ స్పందనలో కడుమూరు, తూరుమామిడి గ్రామస్తులు తమ భూములను రీసర్వే చేసి పట్టాలు ఇప్పించాలని పిఒకు వినతిపత్రాన్ని అందజేసిన నేపథ్యంలో పిఒ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్‌ఒ మురళీకష్ణ మాట్లాడుతూ గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూములు గుర్తించడం, చనిపోయిన పట్టాదారులు స్థానంలో వారసులకు మ్యూటేషన్ చేయడం, నూతన పట్టాల కోసం దరఖాస్తులు తదితర అంశాలు వివరించారు.. మ్యూటేషన్‌కు ఎఫ్‌ఎంసి ధ్రువపత్రాలు, నోటరీ ఆఫిడవిట్, మృతి చెందిన పట్టాదారుని డెత్ సర్టిఫికెట్ అవసరం లేకుండా పీసా గ్రామసభ తీర్మానం సరిపోతుందన్నారు.కార్యక్రమంలో జిఎం.వలస సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ రామకృష్ణ, రాజన్న దొర, శ్రీను దొర పాల్గొన్నారు.










