Mar 04,2023 00:28

సమీక్ష నిర్వహిస్తున్న తహశీల్దార్‌ జానకమ్మ

ప్రజాశక్తి -కోటవురట్ల:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే పై తహశీల్దారు జానకమ్మ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఆరు గ్రామాల్లో రీ సర్వే పూర్తి కాగా మరో ఐదు గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేపై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు అభ్యంతరాలపై నోటీసులు అందజేసి సర్వే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. మండల వ్యాప్తంగా మరో 10 గ్రామాలకు డ్రోన్‌ సర్వే పూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పందన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, రెవెన్యూ సమస్యలను పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్‌ ప్రసాద్‌, పలు గ్రామాల రెవెన్యూ అధికారులు, సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు.