
మాట్లాడుతున్న ఆర్డిఓ జయరాం
ప్రజాశక్తి-నక్కపల్లి:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ను వేగవంతంగా పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని నర్సీపట్నం ఆర్డిఓ జయరాం సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాలకు చెందిన తహసీల్దార్లు నీరజ, జై ప్రకాష్ ,శ్యామ్‌లతో సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా ఇప్పటి వరకు పూర్తయిన భూముల రీ సర్వేను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా రీ సర్వే చేపట్టాలన్నారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.