
ప్రజాశక్తి-మాడుగుల: ప్రస్తుతం జరుగుతున్న భూముల రీ సర్వే పట్ల రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు సూచించారు. శుక్రవారం మండలం లోని వీరనారాయణ గ్రామంలోని జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. సర్వే రాళు, తవ్వకాలు, ట్యాగ్ మార్కింగ్ వంటి పనులను పరిశీలించారు. భూమి హద్దులను సర్వే రాళ్లతో గుర్తించడం, కొలతలు బట్టి భూమి విస్తీర్ణం కొలవడం వంటి వివరాలను ఆయన పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్న భూముల రీ సర్వేతో భవిష్యత్తులో రైతులు మధ్య ఎటువంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఈ విషయాలు పట్ల రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సర్వేతో ఉపయోగాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. దీంతో రైతులు సానుకూలంగా స్పందించి తమ హద్దులు స్పష్టంగా తెలుస్తున్నాయని, ఇది తమకు ఎంతో ఉపయోగమని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, రెవెన్యూ అధికారులు చిన్నికృష్ణ, జయరాం, తహసీల్దార్ పీవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.