భూమనకు కృతజ్ఞతలు తెలిపిన శెట్టిపల్లి గ్రామస్తులు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
దశాబ్దాల సమస్యను పరిష్కరించడంతో తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డికి శెట్టిపల్లి గ్రామస్థులు కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పద్మావతిపురంలోని భూమన నివాసంలో ఈ మేరకు శెట్టిపల్లి గ్రామస్థులు కలిసి మాట్లాడుతూ ఈ జఠిలమైన సమస్యను నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ఎంతో కార్యచరణతో అందరినీ సమన్వయ పరిచి ప్రొసీడింగ్స్ కాపీలను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నేళ్లుగా ఎంతోమంది అధికారులకు, రాజకీయ నాయకులకు తమ గ్రామ సమస్యను చెప్పి చెప్పి విసిగి వేసారి పోయామన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిన బాబు, బాలమురళికష్ణ, రామకష్ణ, మోహన్, మునిశంకర్, భాస్కర్ రావు, చెంగమునయ్య, యుగంధర్, మునిచెంగయ్య తదితరులు పాల్గొన్నారు.










