Jul 04,2023 20:34

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
భూమిలేని నిరుపేద కుటుంబాలకు రెండెకరాలు ఇవ్వాలని వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం జూనియర్‌ అసిస్టెంట్‌ నబిరసూల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ, బంజారా భూములను సాగు చేసుకుంటూ, కొంతమంది రైతులు అనుభవంలో ఉన్నారని తెలిపారు. అలాంటి రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా నిరుపేదలకు భూమి పంచి ఆదుకోవాలన్నారు. వ్యకాస మండల అధ్యక్షులు మహానంది, రైతుసంఘం మండల కార్యదర్శి రంగస్వామి, అధ్యక్షులు మధు రెడ్డి, నాయకులు మాణిక్యప్ప, అనిమేష్‌, కుమార్‌ పాల్గొన్నారు.