ప్రజాశక్తి-విఆర్.పురం
ఆర్ అండ్ ఆర్, భూమి సర్వేల పేరుతో పోలవరం నిర్వాసిత ప్రజలను మోసం చేయడం దారుణమని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూమి ప్యాకేజీ ఎప్పటిలోగా ఇస్తారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సీపీఎం కూనవరం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూనవరం మండలంలోని పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను గందర గోళంలో పడేస్తున్న ప్రభుత్వాలను, అధి కారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వర రావు మాట్లాడు తూ భూసేకరణ పూర్తి చెయ్యకుండా సాగు సేస్తున్న పట్టా భూమికి నష్ట పరిహారం ఇవ్వకుండా ముంపునకు గురవుతున్నా ఇంత వరకు స్పష్టంగా ఎప్పుడు ప్యాకేజీ ఇస్తారో చెప్పకపోవడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు పాయం సత్యనారాయణ, బి.భద్రయ్య, టి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, సోడి శంకర్, ఎంపీటీసీ కారం జయ, లక్ష్మణ్ పాల్గొన్నారు.










