భూమి పూజ చేస్తున్న దృశ్యం
భూమి పూజ చేస్తున్న దృశ్యం
భూమి పూజ
ప్రజాశక్తి-దగదర్తి:మండలంలోని చెన్నూరు పంచాయతీలో బల్కు మిల్క్ చిల్లింగ్ సెంటర్ విలేజి హెల్త్ క్లినిక్ నూతన భవనాలకు భూమి పూజను రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డు డైరెక్టర్ పి అనిల్ రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నోరును అభివద్ధి పథంలో నడపడమే తన లక్ష్యమని కొనియాడారు. చెన్నూరులో ప్రభుత్వ భవ నాలన్నీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలనాన్ని నినాదంతో ప్రతి పంచాయతీలో ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల ఆదిశేషయ్య, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










